Ram Charan: ఎన్టీఆర్ డైరెక్టర్ తో చేతులు కలపనున్న రామ్ చరణ్

Ram Charan: ఆచార్య తర్వాత మరొక సారి కొరటాల శివ డైరెక్షన్లో మెగా పవర్ స్టార్

admin1
Updated on: 9 Feb 2022 6:00 PM IST
Ram Charan Next Film With Director Koratala Siva | Tollywood News Today
X

Ram Charan: ఎన్టీఆర్ డైరెక్టర్ తో చేతులు కలపనున్న రామ్ చరణ్

Ram Charan: ప్రస్తుతం "ఆర్ ఆర్ ఆర్" సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేతిలో బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. త్వరలోనే శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్న రామ్ చరణ్, "జెర్సీ" ఫేమ్ గౌతమ్ తిన్ననూరి మరియు "కేజీఎఫ్" ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నారు. ఇక మరోవైపు రామ్ చరణ్ కు "రంగస్థలం" వంటి బ్లాక్బస్టర్ ను అందించిన సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా మరొక సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నారట.

ప్రస్తుతం "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న కొరటాల శివ త్వరలోనే ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా ని చేయబోతున్నారు. ఇక ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఒక కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా ఒక ఫుల్ ఫ్లడ్ స్క్రిప్ట్ కొరటాల శివ తయారు చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఎన్టీఆర్ తో సినిమా అయిపోయిన తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేయనున్నారు కొరటాల. మరోవైపు ఆర్ సీ 15 మూడవ షూటింగ్ షెడ్యూల్ ఫిబ్రవరి 10వ తారీకు నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈస్ట్ గోదావరి లోని కొన్ని పల్లెటూరి ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది. అంజలి మరియు శ్రీకాంత్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

admin1

admin1

Next Story