రామ్ చరణ‌్ పాన్ ఇండియా మూవీ.. యంగ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్

Samba Siva Rao
Published on: 31 Dec 2020 5:34 PM IST
రామ్ చరణ‌్ పాన్ ఇండియా మూవీ.. యంగ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్
X

మెగాపవర్ స్టార్ రామ్ చరణ‌్ తన తదుపరి చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే చరణ్ రెండు సినిమాలలో నటిస్తున్నాడు. వీటిలో దిగ్గజ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం ముగింపు దశకి చేరింది. అలాగే, తండ్రి చిరంజీవితో కలసి 'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. 'ఆర్ఆర్ఆర్' పూర్తయిన తర్వాత తన సినిమా యంగ్ డైరెక్టర్ 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో రామ్ చరణ్ చాలా మంది దర్శకులు చెప్పిన పలు కథలు విన్నాడు. వీటిలో 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథ చరణ్ కు బాగా నచ్చిందట. దాంతో అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ తయారుచేసే పనిలో గౌతమ్ ఉన్నాడనీ, చరణ్ నటించే తదుపరి సినిమా ఇదేనని తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున నిర్మించడానికి ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హీరో నాని కెరీర్లోనే ఓ ప్రత్యేక సినిమాను అందించాడు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా జెర్సీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు గౌతమ్. ఈ హిందీ రీమేక్ జెర్సీకి కూడా ఆయనే దర్శకత్వం వహిస్తున్నాడు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story