Ram Charan New Movie: జెర్సీ డైరెక్టర్ తో రాం చరణ్?

Ram Charan New Movie: ప్రస్తుతం రాం చరణ్ 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Venkata Chari
Published on: 7 April 2021 4:28 PM IST
Ram Charan New Movie With a Jersey Director Gowtham Tinnanuri
X

రాం చరణ్, గౌతం (ఫొటో: ది హన్స్ ఇండియా)

Ram Charan New Movie: ప్రస్తుతం రాం చరణ్ 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే, ఈ రెండు సినిమాల తరువాత నేషనల్ డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమా చేయనున్నాడని తెలిసిందే.

వీటి తరువాత తను చేయబోయే సినిమాలు ఏంటని ఇంత వరకు తెలియలేదు. తాజాగా రాం చరణ్ కొత్త మూవీపై టాలీవుడ్ లో ఓ వార్త వైరల్ అవుతోంది. రాం చరణ్ 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ టిన్ననూరి తో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. జెర్సీ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో వీరి కాంబినేషన్ లో మూవీ రాబోతున్నట్లు సన్నిహిత వర్గాలు చర్చించుకుంటున్నాయి.

"మల్లి రావా" చిత్రంతో జెర్సీ డైరెక్టర్ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత నానితో 'జెర్సీ' సినిమా చేశాడు. "జెర్సీ" మూవీ ప్రస్తుతం ఈ డైరెక్టర్ తోనే హిందీలో రీమేక్ అవుతోంది. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

కాగా, "ఆచార్య" లో సిద్ధగా రాం చరణ్ కనిపించనున్నాడు. అలాగే ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'ఆర్ఆర్ఆర్'చిత్రంలో అల్లూరి సీతా రామరాజు పాత్రలో అలరించనున్న విషయం తెలిసిందే.

Venkata Chari

Venkata Chari

Next Story