రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ ను పక్కన పెట్టేశారా?

*ఇక రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ ను పక్కన పెట్టేశారా?

Jyothi
Updated on: 16 Sept 2022 10:31 AM IST
Ram Charan kept Shankar Aside and Focused on Another Film
X

రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ ను పక్కన పెట్టేశారా?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్యనే "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తయింది. కానీ శంకర్ ఇప్పుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న "భారతీయుడు 2" సినిమా షూటింగ్ తో బిజీ అవ్వగా #ఆర్సీ15 షూటింగ్ హోల్డ్ లోకి వెళ్ళింది.

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కూడా శంకర్ సినిమాని పక్కన పెట్టి తన తదుపరి సినిమా గురించి ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి "జెర్సీ" ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా నీ క్యాన్సిల్ చేశారు చెర్రీ. అయితే తాజాగా ఇప్పుడు రామ్ చరణ్ కన్నడ డైరెక్టర్ అయిన నార్తన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా "మఫ్టి" అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నార్తన్ డైరెక్షన్లో రామ్ చరణ్ ఒక సినిమా చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. టీ సిరీస్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు సమాచారం. కానీ ఇంకా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరి రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Jyothi

Jyothi

Next Story