ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ తో బిజీగా ఉన్న రామ్ చరణ్

ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ తో బిజీగా ఉన్న రామ్ చరణ్
Ram Charan: ఈమధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు. ఇక ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం తన తదుపరి సినిమా #ఆర్సీ15 పైన పెట్టారు చెర్రీ. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.తాజా సమాచారం ప్రకారం దర్శక నిర్మాతలు ప్రస్తుతం రామ్ చరణ్ పైన కొన్ని కాలేజ్ నాటి సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్కే బీచ్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇదే షెడ్యూల్లో రామ్ చరణ్ కి మరియు పోలీసులకు మధ్య ఒక స్ట్రాంగ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా జరగబోతున్నట్లు తెలుస్తోంది.
"వినయ విధేయ రామ" సినిమా తర్వాత బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ తో జత కట్టనుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెరీర్లో 50వ సినిమాగా విడుదల కాబోతున్న ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
కాంగ్రెస్‌లో ఆపరేషన్ మునుగోడు ప్రారంభం
13 Aug 2022 2:32 AM GMTఅక్కపై తమ్ముడి విలువైన ప్రేమ
13 Aug 2022 2:04 AM GMTమునుగోడుపై బీజేపీ యాక్షన్ ప్లాన్
13 Aug 2022 1:47 AM GMTతిరుమలలో వైభవంగా పున్నమి గరుడసేవ
13 Aug 2022 1:27 AM GMTమునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMT