Dil Raju-Ram Charan: దిల్ రాజు విషయంలో కోపం తెచ్చుకున్న రామ్ చరణ్

Dil Raju-Ram Charan: దిల్ రాజు విషయంలో కోపం తెచ్చుకున్న రామ్ చరణ్

admin1
Updated on: 8 Feb 2022 1:59 PM IST
Ram Charan is Angry About Dil Raju | Telugu Movie News
X

దిల్ రాజు విషయంలో కోపం తెచ్చుకున్న రామ్ చరణ్

Dil Raju-Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న "ఆర్ఆర్ఆర్" సినిమా మార్చి 25న విడుదల కాబోతున్న దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్ 1న విడుదల కావాల్సిన "ఆచార్య" ను రామ్ చరణ్ వాయిదా వేసి ఏప్రిల్ 29 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పెద్ద సినిమాల మధ్య రెండు వారాలైనా గ్యాప్ ఉండేలా చూసుకుంటే బాగుంటుందని నిర్మాత దిల్ రాజు ఎప్పుడూ చెప్పే మాటే. కానీ "ఆచార్య" సినిమా విడుదల అవుతుందని తెలిసినప్పటికీ దాని ముందు రోజు ఏప్రిల్ 28న తన సినిమా "ఎఫ్ 3" ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు దిల్ రాజు. దీంతో ఈ వైఖరిపై రామ్ చరణ్ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. "క్రాక్" సినిమా విషయంలో దిల్ రాజు పై ఘాటు వ్యాఖ్యలు చేసిన డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను దిల్ రాజు కంటే ఎక్కువ అమౌంట్ తో "ఆచార్య" నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు.

దీంతో కోపం తెచ్చుకున్న దిల్ రాజు ఆచార్య సినిమాకి ఒక రోజు ముందే తన ఈ సినిమాని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అయితే మెగాస్టార్ కానీ రామ్ చరణ్ కానీ ఒక్క మాట చెప్పినా దిల్ రాజు కచ్చితంగా తన సినిమాని వాయిదా వేసుకుంటారు. పైగా రామ్ చరణ్ అప్సెట్ అయితే దిల్ రాజు కూడా ఇబ్బంది పడాలి. ఎందుకంటే రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా నీ నిర్మిస్తోంది దిల్ రాజే. అసలే అతి త్వరలో రాజమండ్రి సమీపంలోని బొబ్బిలి లంక అనే ఒక పల్లెటూర్లో ఇరవై రోజుల పాటు షూటింగ్ జరగాల్సి ఉంది. దిల్ రాజు వైఖరిపై కోపం తెచ్చుకుని రామ్ చరణ్ షూటింగ్ కి హాజరు అవ్వకపోతే ఇబ్బంది పడాల్సి వచ్చేది సినిమాని నిర్మిస్తున్న దిల్ రాజే.

admin1

admin1

Next Story