Ram Charan: రెండు విభిన్న పాత్రల్లో రామ్ చరణ్

Ram Charan: *ప్రభుత్వ ఉద్యోగి పాత్ర లో మెగా పవర్ స్టార్

admin1
Published on: 4 April 2022 11:33 AM IST
Ram Charan in Two Different Roles
X

Ram Charan: రెండు విభిన్న పాత్రల్లో రామ్ చరణ్

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ హీరోలుగా నటించిన "ఆర్ ఆర్ ఆర్" సినిమా రాజమౌళి దర్శకత్వంలో మార్చి 25 న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించనుంది. స్టార్ కోలీవుడ్ నటుడు ఎస్.జె.సూర్య కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమా లో రామ్ చరణ్ పాత్ర గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్న గెటప్లలో కనిపించబోతున్నాడట. ఒక వైపు స్టూడెంట్ పాత్రలో అలరించనున్న రామ్ చరణ్ ప్రభుత్వ ఉద్యోగిగా కూడా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ పాత్ర గురించిన మరిన్ని వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దిల్ రాజు మరియు శిరీష నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

admin1

admin1

Next Story