Sujeeth - Charan: "సాహో"దర్శకుడు సుజీత్ కథకు ఓకే చెప్పిన రామ్ చరణ్.!?

Sandeep Reddy
Published on: 2 Aug 2021 5:42 PM IST
Ram Charan Impress with Saaho Movie Director Sujeeth Narrated Story and Details Announce Soon
X

Sujeeth - Ram Charan

Sujeeth - Ram Charan: "చిరుత"ల వెండితెరపైకి దూసుకొచ్చి "మగధీర" తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి త్వరలో "రౌద్రం రణం రుధిరం" అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్టార్ హీరో రామ్ చరణ్ మరొక సినిమాకి ఓకే చెప్పనున్నాడు. ఇప్పటికే ఒక సాంగ్ మినహా షూటింగ్ పూర్తి చేసుకొని రామానాయుడు స్టూడియోలో డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్న "ఆర్ఆర్ఆర్" టీం ఈ సినిమాని అక్టోబర్ నెలలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. ఈ సినిమాలో అల్లూరి సీత రామరాజు పాత్రలో కనిపించిన రామ్ చరణ్ తన 15వ చిత్రం శంకర్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన వివరాలను రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు తమ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ సినిమా ఇలా మొదలైందో లేదో రామ్ చరణ్ మరొక సినిమాకి సైన్ చేయబోతున్నాడు.

"సాహో" చిత్ర దర్శకుడు సుజీత్ తాజాగా ఒక కథని రామ్ చరణ్ కి వినిపించగా ఆ కథకి చెర్రీ చాలా ఇంప్రెస్ అయ్యాడని, ఆ సినిమాలో నటించడానికి కూడా ఆసక్తి చూపినట్లు సమాచారం. ఈ సినిమాని ప్రభాస్ స్నేహితులు ప్రముఖ నిర్మాతలు ప్రమోద్, వంశీ కృష్ణలు యూవి క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు దర్శకుడు సుజీత్ అతి త్వరలో సోషల్ మీడియా వేదికగా ప్రకటించనున్నాట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక భారీ అంచనాలతో విడుదలైన ప్రభాస్ "సాహో" చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు సాధించిన ప్రేక్షకులను మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా తర్వాత సుమారుగా రెండేళ్ళ గ్యాప్ తర్వాత మరోక కొత్త కథ కథనంతో రాబోతున్న సుజీత్ మరి రామ్ చరణ్ తో అయిన హిట్ కొడుతాడో చూడాలి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story