కష్టాల్లో ఉన్న ఉక్రెయిన్‌ బాడీగార్డ్‌కు రామ్‌చరణ్‌ సాయం.. చెర్రీ గొప్ప మనసుకి నిదర్శనమన్న..

Ram Charan: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతోంది.

Arun Chilukuri
Updated on: 18 March 2022 7:30 PM IST
Ram Charan Helps Ukranian Security Guard Family
X

కష్టాల్లో ఉన్న ఉక్రెయిన్‌ బాడీగార్డ్‌కు రామ్‌చరణ్‌ సాయం.. చెర్రీ గొప్ప మనసుకి నిదర్శనమన్న..

Ram Charan: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతోంది. అయితే.. ఇప్పుడు ఈ యుద్ధంలో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ పేరు వినిపిస్తోంది. ఇదేంటి.. ఎక్కడో ఉన్న ఉక్రెయిన్‌కి, చెర్రీకి సంబంధం ఏంటని అనుకుంటున్నారా.. కరెక్టే.. యుద్ధానికి, చరణ్‌కు సంబంధం లేదు. కానీ.. రష్యా సైనికుల నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటున్న ఉక్రెయిన్‌ పౌరుడికి, రామ్‌చరణ్‌కు సంబంధం ఉంది.

రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిసి నటించిన ట్రిపుల్‌ ఆర్‌ మూవీ షూటింగ్‌.. కొంతకాలం ఉక్రెయిన్‌లో కూడా జరిగింది. ఆ షూటింగ్‌ జరిగే సమయంలో రస్తీ అనే వ్యక్తి.. చెర్రీకి సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేశారు. దీంతో చరణ్‌తో రస్తీకి సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే.. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌ దేశస్థులు చాలామంది లాగే.. రస్తీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

చేయడానికి పనిలేదు.. అలాగని దేశాన్ని వదిలి, వేరే చోటుకు వెళ్లి బతకలేడు. ఇవన్నీ పక్కనపెడితే.. తన దేశం కోసం గన్‌ చేతపట్టి యుద్ధంలో నిమగ్నమయ్యాడు రస్తీ. ఈ విషయం తెలుసుకున్న రామ్‌చరణ్‌.. రస్తీ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. చెర్రీ తనకు చేసిన సాయం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు రస్తీ. కొంత కాలమే కలిసి పనిచేసినా.. కష్టాల్లో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకోవడం చరణ్‌ గొప్ప మనసుకి నిదర్శనమని రస్తీ కృతజ్ఞతలు తెలిపాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story