రాజమౌళి మరియు శంకర్ ల డైరెక్షన్ లో నటించిన ఒకే ఒక్క హీరో

రాజమౌళి మరియు శంకర్ ల డైరెక్షన్ లో నటించిన ఒకే ఒక్క హీరో

admin1
Updated on: 1 March 2022 4:01 PM IST
Ram Charan Has Worked With Iconic Directors | Tollywood News
X

రాజమౌళి మరియు శంకర్ ల డైరెక్షన్ లో నటించిన ఒకే ఒక్క హీరో

Ram Charan: టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లు చాలా మంది ఉన్నప్పటికీ అందులో ఎస్.ఎస్.రాజమౌళి మరియు శంకర్ల తీరు వేరు. ప్రతి సినిమాతోనూ తెలుగు ఇండస్ట్రీ ను ఒక మెట్టు పైకి ఎక్కిస్తూ తమదైన శైలిలో అద్భుతమైన సినిమాలు తెరకెక్కిస్తున్నారు రాజమౌళి మరియు శంకర్. రొటీన్ కమర్షియల్ సినిమాలకి దూరంగా ఉంటూ కథ కి ప్రాధాన్యత ఇస్తూ ప్యాన్ ఇండియన్ సినిమాలు తీయడం వీరి ప్రత్యేకత. అయితే టాలీవుడ్లో దిగ్గజ డైరెక్టర్లు గా ఉన్న ఈ ఇద్దరితో పనిచేయాలని అందరు స్టార్ హీరోలు కలలుకంటారు. కానీ ఇద్దరితో పనిచేసే అవకాశం ఇప్పటి దాకా కేవలం ఒక్క స్టార్ హీరో కే దక్కింది.

అది మరెవరికో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి. రెండవ సినిమా కే రాజమౌళి దర్శకత్వంలో "మగధీర" సినిమాలో నటించిన రామ్ చరణ్ మళ్లీ "ఆర్ఆర్ఆర్" సినిమాతో రాజమౌళితో రెండవసారి పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇక రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా కి శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కెరియర్ లో 15వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటిదాకా రాజమౌళి మరియు శంకర్ లతో కలిసి పనిచేసిన ఒకే ఒక్క హీరోగా రామ్ చరణ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

admin1

admin1

Next Story