Ram Charan: ఓటిటి లలో అడుగు పెడుతున్న రామ్ చరణ్

Ram Charan: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి సంబంధించిన కొన్ని కమర్షియల్స్ లో ఇప్పుడు రామ్ చరణ్ కనిపించబోతున్నారు

admin1
Updated on: 9 Oct 2021 11:36 AM IST
Ram Charan has Become the Brand Ambassador for Disney Plus Hot Star | Tollywood News Today
X

రామ్ చరణ్ (ఫోటో- ది హన్స్ ఇండియా )

Ram Charan: అటు స్టార్ హీరోగా సూపర్ హిట్ సినిమాలను అందిస్తున్న రామ్ చరణ్ మరోవైపు నిర్మాతగా కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. కొణిదల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చిరంజీవి సినిమాలను నిర్మిస్తున్న రామ్ చరణ్ తాజాగా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద కన్నేశారు. లాక్ డౌన్ పుణ్యమా అని ఓటిటి ల క్రేజ్ బీభత్సంగా పెరిగి పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కూడా ఓటిటి లలో అడుగు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఓటిటి లలో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారట. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి సంబంధించిన కొన్ని కమర్షియల్స్ లో ఇప్పుడు రామ్ చరణ్ కనిపించబోతున్నారు. దీనికోసం రామ్ చరణ్ ఏకంగా మూడు కోట్ల రూపాయలను పారితోషికం గా తీసుకోబోతున్నట్లు సమాచారం.నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటిటి లతో పోలిస్తే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి ఉన్న క్రేజ్ తక్కువనే చెప్పాలి. కానీ బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్ ఎంట్రీ హాట్ స్టార్ కి పెద్ద బూస్ట్ అవ్వనుందని అందరూ అనుకుంటున్నారు. మరో వైపు రామ్ చరణ్ "ఆర్ఆర్ఆర్" మరియు "ఆచార్య" సినిమాలతో బిజీగా ఉన్నారు.

admin1

admin1

Next Story