Ram Charan: పూనకాలు తెప్పించేలా గేమ్ ఛేంజర్ క్లైమాక్స్..!

Ram Charan: పూనకాలు తెప్పించేలా గేమ్ ఛేంజర్ క్లైమాక్స్..!

Arun Chilukuri
Updated on: 21 April 2023 9:30 PM IST
Ram Charan Game Changer Movie Climax Entertains
X

Ram Charan: పూనకాలు తెప్పించేలా గేమ్ ఛేంజర్ క్లైమాక్స్..!

Ram Charan: గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఇటు పర్సనల్ లైఫ్ ని అటు ప్రొఫెషనల్ లైఫ్ ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వాహ్ అనిపించుకుంటున్నాడు. వైఫ్ ఉపాసన కోసం పుట్టబోయే బిడ్డ కోసం వీలైనంత ఎక్కువగా టైమ్ కేటాయిస్తూనే మరోవైపు గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ని చరణ్ పరుగులు పెట్టించేస్తున్నాడు. విలక్షణ దర్శకుడు శంకర్ నేతృత్వంలో రాజకీయ, సమకాలీన అంశాలతో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ లో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ లోగో కు విశేష స్పందన రాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది.

గేమ్ ఛేంజర్ షూటింగ్ ని శంకర్ దాదాపుగా పూర్తి చేశాడు. మరో రెండు నెలలు మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం శంకర్ క్లైమాక్స్ ఎపిసోడ్ షూటింగ్ పై ఫోకస్ పెట్టాడు. హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో ఓ భారీ సెట్ వేసిన శంకర్ కేజీఎఫ్ యాక్షన్ మాస్టర్స్ అన్బు అండ్ అరివు డైరెక్షన్ లో క్లైమాక్స్ ను శంకర్ చిత్రీకరించబోతున్నాడు. ఇది శంకర్ స్టయిల్ లో చాలా లావిష్ గా సినిమాకే హైలెట్ గా ఉంటుందని ఫిలిమ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది.

రాంచరణ్ మగధీర సినిమాలో 100 మందితో చేసిన ఫైట్ మనకు తెలిసిందే కదా..ఆ ఫైట్ ను మించేలా గేమ్ ఛేంజర్ లో భారీ ఫైట్ ను శంకర్ ప్లాన్ చేశాడట. దాదాపు 12వందల మందితో క్లైమాక్స్ ఫైట్ ఉంటుందట. ఈ ఎపిసోడ్ కోసమే మన టాలీవుడ్ ఫైటర్స్ తో పాటుగా కన్నడ నుంచి కూడా ఫైటర్స్ ను శంకర్ రప్పించాడట. ఈ ఫైట్ లో విలన్ గా నటిస్తున్న ఎస్ జే సూర్య కూడా జాయిన్ అవ్వబోతున్నాడట.

మగధీర సినిమాలో వందమందితో ఫైట్ అంటేనే థియేటర్లు మోత మోగాయి..ఇప్పుడు 12వందల మందితో ఫైట్ అంటే దద్దరిల్లడం ఖాయం..వెయ్యి మందితో తమ అభిమాన హీరో చేసే ఫైట్ చూడాలని మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ క్లైమాక్స్ ఫైట్ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత చరణ్ బ్రేక్ తీసుకోనున్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story