Ram Charan - RRR Movie: కొమరం భీమ్ పాత్ర గురించి చెప్తున్న రామ్ చరణ్

Ram Charan Explains His Character in RRR Movie
x

రామ్ చరణ్ (ట్విట్టర్ ఫోటో)

Highlights

Ram Charan - RRR Movie: తెలుగులో స్టార్ హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న...

Ram Charan - RRR Movie: తెలుగులో స్టార్ హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మొట్టమొదటి సినిమా "ఆర్ఆర్ఆర్". జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్యాన్ ఇండియన్ చిత్రంగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. పీరియడ్ బ్యాక్ డ్రాప్ తో నడిచే ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు. ఒకవేళ నిజంగా అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ కలిసి ఉంటే ఏం జరిగి ఉండొచ్చు అనే ఒక ఫిక్షనల్ కథే ఈ సినిమా.

ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటున్న ఎన్టీఆర్ మరోవైపు బుల్లితెరపై కూడా హంగామా చేస్తున్నారు. "ఎవరు కోటీశ్వరులు" అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు ఎన్టీఆర్. ఈ షో ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా నిన్న అనగా ఆగస్టు 22న ఈ షో కి సంబంధించిన కర్టెన్ రైజర్ ఈవెంట్ జరిగింది. దీనిలో భాగంగా రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ రామ్ చరణ్ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. కొమరం భీమ్ పాత్ర నుంచి ప్రేక్షకులకు చాలా సర్ప్రైజ్ లు ఉంటాయని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories