RRR Movie - Ram Charan: షూటింగ్ సెట్స్ పై దాదాపు ఏడ్చేసిన రామ్ చరణ్

* ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో మరోవైపు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు

admin1
Updated on: 21 Sept 2021 4:43 PM IST
Ram Charan Cried while Filming a Powerful Scene
X

"ఆర్ ఆర్ ఆర్" సినిమా(ఫోటో-ది హన్స్ ఇండియా)

RRR Movie - Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనుండగా మరోవైపు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఒక పవర్ ఫుల్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో రామ్ చరణ్ సెట్స్ పై ఎడ్చేశారట.

సినిమాలోని ఒక సన్నివేశం ప్రకారం అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ ను కొరడాతో కొట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఒక్క సన్నివేశాన్ని చిత్రీకరించిన తర్వాత రామ్ చరణ్ దాదాపు ఏడ్చేశాడట. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక అలియా భట్ మరియు ఓలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని డివీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

admin1

admin1

Next Story