"ఎన్టీఆర్ నుంచి చూపు తిప్పుకోలేక పోయాను" అంటున్న రామ్ చరణ్

Ram Charan: "ఎన్టీఆర్ నుంచి చూపు తిప్పుకోలేక పోయాను" అంటున్న రామ్ చరణ్

admin1
Updated on: 8 April 2022 12:01 PM IST
Ram Charan Comments on the NTR Role in RRR Movie | Telugu Movie News
X

"ఎన్టీఆర్ నుంచి చూపు తిప్పుకోలేక పోయాను" అంటున్న రామ్ చరణ్ 

Ram Charan: అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కొమరం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన "అర్ఆర్ఆర్" సినిమా భారీ అంచనాల మధ్య మార్చి 25న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే బ్లాక్బస్టర్ టాక్ ను అందుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తి కరమైన కామెంట్లు చేశారు.

సినిమాలు రామ్ చరణ్ చాలా బాగా నటించారని చాలా వరకు క్రెడిట్ తనకే దక్కుతుందని ఒక జర్నలిస్టు అడగగా రామ్ చరణ్ దానికి ససేమిరా ఒప్పుకోలేదు. "నేను దాన్ని నమ్మను మేడం. మేమిద్దరం ఈక్వల్ గా కష్టపడి బాగా నటించాం. తారక్ కూడా చాలా ఫెంటాస్టిక్ గా నటించారు. సినిమా చూస్తున్నప్పుడు ఎన్టీఆర్ నుంచి నేను చూపు తిప్పుకోలేక పోయాను" అని అన్నారు రామ్ చరణ్.

ఆలియా భట్ మరియు ఓలివియా మోరిస్ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. డీ వి వి ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.

admin1

admin1

Next Story