Acharya: ఆచార్య లో నటించడం పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్...

Acharya: ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ కూడా పాల్గొంటున్నారు...

Shireesha
Published on: 21 April 2022 4:40 PM IST
Ram Charan Clarity on Acharya Movie about His Role | Megastar Chiranjeevi | SS Rajamouli
X

Acharya: ఆచార్య లో నటించడం పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్.. 

Acharya: ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ కూడా పాల్గొంటున్నారు.

"ఆచార్య" సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా కోసం సమయాన్ని ఎలా కేటాయించారు అని ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ జవాబిచ్చారు రామ్ చరణ్. మొదట రాజమౌళి ని సంప్రదించడానికి డైరెక్టర్ శివ చాలా భయపడ్డారు అని తనకు సహాయం చేయమని చిరంజీవిని కూడా కోరాలని చెప్పుకొచ్చారు చరణ్.

మెగాస్టార్ రాజమౌళిని కలిసి ఆచార్య షూటింగ్ పూర్తి చేయడం కోసం కొన్ని రోజులు చరణ్ ను విడిచిపెట్టమని ఒప్పించారని చెప్పిన రామ్ చరణ్ తండ్రి కొడుకులను వెండితెరపై చూడాలనేది తన తల్లి కోరిక అని చెప్పుకొచ్చారు.

Shireesha

Shireesha

Next Story