Evaru Meelo Koteeswarudu: హోస్ట్ గా ఎన్టీఆర్.. అతిధిగా రామ్ చరణ్

Sandeep Reddy
Updated on: 16 July 2021 12:22 PM IST
Ram Charan Chief Guest For Junior NTR Evaru Meelo Koteeswarudu Show
X

 ఎన్టీఆర్ తో రామ్ చరణ్ (ఫైల్ ఫోటో)

Evaru Meelo Koteeswarudu: జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా త్వరలో బుల్లితెరపై ప్రారంభం కానున్న "ఎవరు మీలో కోటీశ్వరుడు" షోకి రామ్ చరణ్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నాడు. ఇప్పటికే "ఆర్ఆర్ఆర్" సినిమాతో గత కొంతకాలంగా షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ ఇద్దరు హీరోలు ఈ షోతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా విడుదలైన ఆర్ ఆర్ ఆర్ చిత్ర మేకింగ్ వీడియో ఇప్పటికే తెలుగు సినిమా అభిమానులను ఆకట్టుకొని యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, కీరవాణి సంగీతం, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటన ఈ సినిమాకి హైలైట్ నిలవనున్నాయి.

ఇక ఒక ప్రముఖ టివి ఛానెల్ లో ప్రారంభం కానున్న ఈ షోకి ఇప్పుడు రామ్ చరణ్ మొదటి అతిధిగా వస్తుడటంతో ఫస్ట్ డే షోకి మరింత క్రేజ్ రానుంది. ఇక ప్రస్తుతం తెలుగులో అటు "ఆర్ఆర్ఆర్" మేకింగ్ వీడియోతో యూ ట్యూబ్ ని షేక్ చేస్తూ మంచి ఊపు మీదున్న ఈ యంగ్ హీరోలు అటు బుల్లితెరలో కూడా "ఎవరు మీలో కోటీశ్వరుడు" షో మొదటి రోజు టీఆర్పీ రేటింగ్ తోను రికార్డు సృష్టించడానికి రెడీ అవుతున్నారు. ఇక దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న "ఆర్ఆర్ఆర్" చిత్రం అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story