Ram Charan: చరణ్ రూ.300 కోట్ల సినిమా.. కన్ ఫామ్ చేసిన దర్శకుడు చందూ మొండేటి..

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేసే తన తదుపరి చిత్రంలో హీరోగా రాంచరణ్ నటిస్తున్నట్లు చందూ మొండేటి ప్రకటించాడు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలిపాడు.

Dhatripriya
Updated on: 1 Jun 2023 9:30 PM IST
Ram Charan: చరణ్ రూ.300 కోట్ల సినిమా.. కన్ ఫామ్ చేసిన దర్శకుడు చందూ మొండేటి..
X

Ram Charan: చరణ్ రూ.300 కోట్ల సినిమా. కన్ ఫామ్ చేసిన దర్శకుడు చందూ మొండేటి

Ram Charan: RRR మూవీతో మెగా పవర్ స్టార్ రాంచరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం చరణ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ ఫిమేల్ లీడ్ లో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ నటించనున్నాడు. వెంకట సతీష్ కిలారు నిర్మించే ఈ చిత్రాన్ని దర్శకుడు రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తాడని టాక్ నడుస్తోంది.

RRR ఆస్కార్ అవార్డ్స్ ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ తో పలు హాలీవుడ్ సంస్థలు సంప్రదింపులు జరిపాయి. ఈ విషయాన్ని చెర్రీ స్వయంగా అంగీకరించడంతో తమ అభిమాన హీరో పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగాడంటూ మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడ్డారు. హాలీవుడ్ ప్రాజెక్ట్ త్వరలోనే అనౌన్స్ చేస్తారని భావించారు. కానీ, నెలలు గడుస్తున్నా చరణ్ నుంచి ఆ దిశగా ఎలాంటి ప్రకటన లేదు. ఆయన కేవలం నిర్మాతగా మారి ఇతర హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. ఈ తరుణంలో ఒకింత నిరాశతో ఉన్న మెగా అభిమానుల్లో జోష్ నింపేస్తూ కార్తికేయ2 ఫేం చందూ మొండేటి..చరణ్ అప్ కమింగ్ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

కార్తీకేయ2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిన చందూ మొండేటి ఈ ప్రాజెక్ట్ తర్వాత కొత్తగా ఏ చిత్రానికి సైన్ చేయలేదు. ఈ క్రమంలో ఒక మూవీ ఈవెంట్ లో పాల్గొన్న చందూ మొండేటి తన తదుపరి ప్రాజెక్ట్ గురించి రివీల్ చేశాడు. కార్తీకేయ2 కంటే ముందుగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేసేందుకు ఒప్పుకున్నానని..అది త్వరలోనే మెటీరియలైజ్ కానుందని చెప్పాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేసే తన తదుపరి చిత్రంలో హీరోగా రాంచరణ్ నటిస్తున్నట్లు చందూ మొండేటి ప్రకటించాడు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం చందూ మొండేటి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రాంచరణ్ నటించిన మగధీర ఏ రేంజ్ లో హిట్టయిందో మనందరికీ తెలిసిందే. మళ్లీ, అదే బ్యానర్ లో రాంచరణ్ భారీ బడ్జెట్ సినిమా రాబోతోందని తెలియడంతో మెగా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మొత్తంగా, చరణ్-గీతా ఆర్ట్స్, చందూ మొండేటి ముగ్గురు కలిసి మగధీరను మరిపించే స్థాయిలో సినిమాని అందించేందుకు రెడీ అయ్యారు.

Dhatripriya

Dhatripriya

Next Story