Ram Charan: ఈ రాజకీయ నాయకుడి జీవితం ఆధారంగా రామ్ చరణ్ పాత్ర?

* శంకర్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర లక్ష్మి నారాయణ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందట.

admin1
Updated on: 10 Nov 2021 2:25 PM IST
Ram Charan Character will be Same as Political Leader JD Lakshmi Narayana Real Life in RC 15 Movie
X

ఆర్సీ15 (ఫైల్ ఫోటో)

Ram Charan: ఈ మధ్యనే "ఆర్ ఆర్ ఆర్" సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. పుణె కి దగ్గర్లో ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల పాటు జరిగింది.

ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాని అభిమానులు ఆర్సీ15 అని పిలుస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో చెర్రీ పాత్ర గురించి ఒక ఆస్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ పాత్ర రాజకీయ నాయకుడుగా మారిన పోలీస్ ఆఫీసర్ జేడీ లక్ష్మినారాయణకి దగ్గరగా ఉంటుందట.

పోలీస్ ఆఫీసర్ గా రిటైర్ అయిన జేడీ లక్ష్మినారాయణ పదవిలో ఉన్నపుడు సత్యం స్కాండల్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంటి కేసులను హ్యాండిల్ చేశారు. 2019 కి ఆయన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరారు. వైజాగ్ నియోజక వర్గం నుండి పోటీ చేసి లక్ష్మి నారాయణ ఓడిపోగా, పార్టీ లోనుండి కూడా వెళ్ళిపోయారు.

ఇక శంకర్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర లక్ష్మి నారాయణ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందట. శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో కియర అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

admin1

admin1

Next Story