బ్రాండ్ అంబాసిడర్ గా మారిన రామ్ చరణ్

Ram Charan: గ్లామర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన రామ్ చరణ్

Jyothi
Published on: 31 Aug 2022 8:43 AM IST
Ram Charan Became the Brand Ambassador
X

బ్రాండ్ అంబాసిడర్ గా మారిన రామ్ చరణ్

Ram Charan: "ఆర్ ఆర్ ఆర్" సినిమా బ్లాక్ బస్టర్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. రామ్ చరణ్ కు సినిమా ఆఫర్లతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్ ఆఫర్లు కూడా బీభత్సంగా పెరిగిపోయాయి. ఒకవైపు "పుష్ప" సినిమాతో వచ్చిన క్రేజ్ తర్వాత అల్లు అర్జున్ కూడా పలు టీవీ కమర్షియల్స్ లో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ కూడా బ్రాండ్ ఎండార్స్మెంట్లలో దిగడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

గ్లామర్ కి రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నట్లు తెలుస్తోంది. సంవత్సరం పాటు రామ్ చరణ్ గ్లామర్ బైక్ వారికి బ్రాండ్ అంబాసిడర్ గా కాంట్రాక్టు సైన్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన టీవీ కమర్షియల్ లో రామ్ చరణ్ అడ్వెంచర్స్ గా కనిపించబోతున్నారు అని తెలుస్తోంది. గతంలో కూడా చిరుత సినిమా తర్వాత రామ్ చరణ్ డొకోమోకి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. ఆ తరువాత బాలీవుడ్ లో జంజీర్ సినిమా తర్వాత టీవీసీ వారికి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసిన చెర్రీ కి "ఆర్ ఆర్ ఆర్" తర్వాత బోలెడు బ్రాండ్ ఎండార్స్మెంట్ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.

Jyothi

Jyothi

Next Story