CM Ram Charan: శంకర్ సినిమాలో సీఎంగా రామ్ చరణ్?

CM Ram Charan : ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.

Venkata Chari
Published on: 28 March 2021 1:02 PM IST
Ram Charan As Chief Minister in Director Shankars Movie
X

రాం చరణ్ (ఫొటో ట్విట్టర్)

CM Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం లా సందడి చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు మగధీర హీరో. ఈ సినిమాలో తండ్రీకొడుకులు నక్సలైట్స్ గా కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే.. శంకర్, చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కు ఇది 50వ సినిమా కాగా, చరణ్ కు ఇది 15వ సినిమా. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమాను.. భారీ బడ్జెట్ తో దిల్ రాజు- శిరీష్ సంయుక్తంగా నిర్మించనున్నారు.

అయితే ఈ సినిమాపై అప్పుడే చర్చ మొదలైంది. ప్రస్తుతం వస్తున్న పుకార్ల మేరకు, ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇక ఈ మూవీలో చరణ్ సీఎంగా కనిపించనున్నాడని టాక్. శంకర్ తరహాలో సందేశాత్మక అంశాలతోపాటు భారీ స్థాయిలో ఉండబోతోందంట. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ఇక చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాల నుంచి రాంచరణ్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Venkata Chari

Venkata Chari

Next Story