Ram Charan-Upasana: మెగా వారసుల పేర్లు ఖరారు.. కూతురికి ‘అన్వీరా దేవి’.. కుమారుడి పేరులో చిరంజీవి సెంటిమెంట్!

Ram Charan-Upasana: మెగా వారసుల పేర్లు ఖరారు.. కూతురికి ‘అన్వీరా దేవి’.. కుమారుడి పేరులో చిరంజీవి సెంటిమెంట్!
x
Highlights

Ram Charan-Upasana: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు..ఇటీవల జన్మించిన తమ కవల పిల్లలకు నామకరణం చేశారు.

Ram Charan-Upasana: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు..ఇటీవల జన్మించిన తమ కవల పిల్లలకు నామకరణం చేశారు. కూతురికి అన్వీరా దేవీ, కుమారుడికి శివ్‌రామ్‌గా పేర్లు పెట్టినట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఐతే వారికి ఆ పేర్ల ఎంపిక వెనుక ఉన్న ప్రత్యేకతలపై చర్చ జరుగుతుంది. అన్వీరా దేవీ అంటే ధైర్యవంతురాలైన అమ్మవారు అనే అర్థం వస్తుంది.

అలాగే కుమారుడికి పెట్టిన శివ్‌రామ్ నామకరణంలో..చిరంజీవి అసలు పేరైన శివశంకర్ వర ప్రసాద్‌లోని శివ్ పదాన్ని..రామ్ చరణ్‌లో నుంచి రామ్‌ను తీసుకుని పేరు పెట్టినట్లు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. చిన్నారులకు ధైవానుగ్రహం ఉండాలనే ఉద్దేశంతో.. ఈ నామకరణాలు పెట్టినట్టు తెలుస్తోంది. జనవరి 31న మెగా కోడలు ఉపాసన కవలపిల్లలకు జన్మనిచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories