Ram Charan-SJ Surya: రామ్ చరణ్ సినిమా కోసం తమిళ స్టార్ యాక్టర్ ఎస్.జె.సూర్య

Ram Charan-SJ Surya: రామ్ చరణ్ సినిమా కోసం తమిళ స్టార్ యాక్టర్ ఎస్.జె.సూర్య

admin1
Updated on: 15 Feb 2022 9:01 PM IST
Ram Charan and SJ Surya Acting Together | Telugu Movie News
X

రామ్ చరణ్ సినిమా కోసం తమిళ స్టార్ యాక్టర్ ఎస్.జె.సూర్య

Ram Charan-SJ Surya: త్వరలో "ఆర్ ఆర్ ఆర్" సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తన కెరీర్లోని పదిహేనవ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఒక పొలిటికల్ థ్రిల్లర్గా విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక తమిళ స్టార్ యాక్టర్ మరియు డైరెక్టర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు ఎస్ జే సూర్య. రామ్ చరణ్ శంకర్ సినిమాలో ఎస్.జె.సూర్య ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎస్.జె.సూర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.

గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన "స్పైడర్" సినిమాలో సూర్య విలన్ పాత్రలో కనిపించారు. ఈమధ్యనే శింబు హీరోగా నటించిన "మానాడు" సినిమాలో కూడా విలన్ గా నటించిన ఎస్ జే సూర్య తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. మరోవైపు తమిళంలో శివ కార్తికేయన్ హీరో గా నటిస్తున్న ఈ సినిమాలో కూడా ఎస్ జే సూర్య విలన్ గా కనిపించనున్నారు. ఈ మార్చ్ 25 న సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. రామ్ చరణ్ తో ఎస్.జె.సూర్య చేయబోయే సినిమా షూటింగ్ ఈస్ట్ గోదావరి లోని కొన్ని ప్రాంతాలలో జరగబోతోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంగీతాన్ని ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story