RRR Movie: వీరిద్దరి మధ్య ఫైట్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకే హైలైట్గా ఉంటుందట

Ram Charan And NTR Fight Scene Going to Highlight in RRR Movie
x

రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

RRR Movie: వీరిద్దరి మధ్య ఫైట్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకే హైలైట్గా ఉంటుందట

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ హీరోలు గా, పీరియడ్ బ్యాక్ డ్రాప్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'ఆర్ ఆర్ ఆర్' చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా మరోవైపు ఎన్టీఆర్ కొమురంభీమ్ పాత్రలో అలరించనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల అవుతుంది అని దర్శక నిర్మాతలు ప్రకటించారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఈ సినిమా మరింత వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలోని ఒక సన్నివేశం గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సినిమాలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల మధ్య ఒక సెన్సేషనల్ ఫైట్ సీక్వెన్స్ ఉండబోతుందట. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్గా నిలువనుందని సమాచారం. ప్రేక్షకులకు ఇది ఒక కనులవిందుగా ఉంటుంది అని తెలుస్తోంది. ఈ సీన్ ఖచ్చితంగా ప్రేక్షకులకు రోమాలు నిక్క పొడుచుకునే విధంగా ఉంటుందట. ఈ ఫైట్ సీక్వెన్స్ గురించి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆలియా భట్ మరియు ఒలివియా మోరీస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories