Unstoppable With NBK: అన్ స్టాపబుల్ షోలో మరో క్రేజీ కాంబినేషన్

Unstoppable With NBK: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సెలబ్రిటీ టాక్ షో కి ఉన్న క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Updated on: 4 Jan 2023 5:01 PM IST
Ram Charan And KTR In Balakrishna Unstoppable Talk Show
X

Unstoppable With NBK: అన్ స్టాపబుల్ షోలో మరో క్రేజీ కాంబినేషన్

Unstoppable With NBK: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సెలబ్రిటీ టాక్ షో కి ఉన్న క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ షో కి గెస్ట్ గా విచ్చేయడంతో ఈ షోకి ఉన్న పాపులారిటీ కూడా బాగానే పెరిగిపోయింది. ఇక త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రాబోతుండడంతో అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ షోలో మరొక క్రేజీ కాంబినేషన్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ కలిసి బాలకృష్ణ షో కి గెస్ట్‌లుగా విచ్చేయబోతున్నారు అని ఇండస్ట్రీ వర్గాల బోగట్ట. ఒకవేళ అదే నిజమైతే ఇది కచ్చితంగా ఒక క్రేజీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చర్చ బాగానే సాగుతోంది. గతంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన పలు ఈవెంట్లకు కేటీఆర్ కూడా ముఖ్యఅతిథిగా విచ్చేశారు. రామ్ చరణ్ ధ్రువ సినిమా ఆడియో ఫంక్షన్ లో కేటీఆర్ స్పీచ్ బాగానే హైలైట్ కూడా అయింది.

ఇలా రామ్ చరణ్ మరియు కేటీఆర్ ల మధ్య స్నేహాన్ని హైలైట్ చేస్తూ ఈ ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ మధ్యనే ప్రభాస్ ఎపిసోడ్ లో బాలకృష్ణ రామ్ చరణ్ కి ఫోన్ చేసి ఎప్పుడు షో కి వస్తావు అని అడగగా తాను కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నానని పిలిస్తే వెంటనే వచ్చేస్తానని రామ్ చరణ్ బదులిచ్చారు. దీంతో బాలకృష్ణ కూడా రామ్ చరణ్ తో పాటు కేటీఆర్ ను కూడా కలిపి గెస్ట్‌లుగా పిలిస్తే బాగుంటుందని ప్లాన్ చేస్తున్నారట. దీని గురించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story