కాజల్ ను విశ్రాంతి తీసుకోమంటున్న మెగా హీరోలు

*ప్రమోషన్ల కు కాజల్ ను దూరం పెట్టనున్న రామ్ చరణ్ మరియు చిరంజీవి

admin1
Updated on: 6 April 2022 12:43 PM IST
Ram Charan and Chiranjeevi Resting Kajal Aggarwal | Tollywood News
X

కాజల్ ను విశ్రాంతి తీసుకోమంటున్న మెగా హీరోలు

Chiranjeevi-Ram Charan: మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "ఆచార్య". స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ కొరటాల కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మొదటి సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు మరియు పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలి అని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా నటించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు గర్భవతి అని అందరికీ తెలిసిందే. దీంతో ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చిరంజీవి మరియు రామ్ చరణ్ కాజల్ ను ఇంట్లోనే రెస్ట్ తీసుకోమని చెబుతున్నారట.

తాను మాత్రం ప్రమోషన్స్ లో పాల్గొనాలని ఆసక్తిగా ఉన్నప్పటికీ ఇద్దరు మెగా హీరోలు మాత్రం ఆమెను ప్రమోషన్ల కి రావద్దని తనకి విశ్రాంతి చాలా ముఖ్యం అని చెబుతున్నారట. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా కనిపించనుంది.

admin1

admin1

Next Story