Ram Charan: పాప నాలానే ఉంటుంది.. అది 21వ రోజున వెల్లడిస్తాం..

Ram Charan: పాప నాలానే ఉంటుంది..

Arun Chilukuri
Updated on: 23 Jun 2023 2:40 PM IST
Ram Charan About His Daughter
X

Ram Charan: పాప నాలానే ఉంటుంది..

Ram Charan Daughter First pic: జూన్ 20వ తేదీ, మంగళవారం పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చిన విషయం తెలిసిందే. రామ్ చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంతో పాటు ఫ్యాన్స్‌ కూడా సంబరాలు చేసుకున్నారు. ఇక పాప పుట్టిన తర్వాత తొలి సారి చరణ్, ఉపాసన ఈ విధంగా తమ ఆనందాన్ని పంచుకున్నారు. జూన్‌ 20న ఉదయం పాప పుట్టింది. ఈరోజు పాప, ఉపాసనను తీసుకుని ఇంటికి వెళుతున్నాం. తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్న ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు. అలాగే అభిమానులు చేసిన ప్రార్థనలు కూడా మర్చిపోలేను. మీ ఆశీస్సులు పాపకు ఎల్లప్పుడూ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సంతోషకర సందర్భంలో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఇప్పటికే ఉపాసన, నేను ఓ పేరు అనుకున్నాం. అది 21వ రోజున వెల్లడిస్తాం. చాలా సంవత్సరాలుగా ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. అనుకున్న సమయంలో భగవంతుడు మాకు పాపను ప్రసాదించాడు అంటూ సంతోషం వ్యక్తం చేశాడు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story