Rakul To Play Karnam Malleswari Biopic : కరణం మల్లీశ్వరి బయోపిక్‌లో రకుల్‌?

Rakul To Play Karnam Malleswari Biopic : కేరటం సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..ఆ తర్వాత

Krishna
Updated on: 9 Aug 2020 5:01 PM IST
Rakul To Play Karnam Malleswari Biopic  : కరణం మల్లీశ్వరి బయోపిక్‌లో రకుల్‌?
X
rakul preet singh(File Photo)

Rakul To Play Karnam Malleswari Biopic : కేరటం సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత లౌక్యం, సరైనోడు, పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, ధృవ సినిమాలు ఆమెకి వరుస విజయాలను అందించాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ బ్యూటికీ హిట్లు లేవు. దీనితో కొంతకాలంగా బాలీవుడ్‌పైన ఫోకస్ పెట్టింది.

అయితే రకుల్ మళ్ళీ తెలుగులో మళ్లీ బిజీ కానుంది.. ఒలింపిక్‌ మెడల్‌ విజేత కరణం మల్లీశ్వరి బయోపిక్‌ను తీయాలని రచయిత, నిర్మాత కోన వెంకట్‌ అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఇందులో లెజండరీ బయోపిక్‌లో రకుల్ మెయిన్ లీడ్ లో నటించనుందని తెలుస్తోంది. కరణం మల్లీశ్వరి పాత్రకి రకుల్ అయితే సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట.. అయితే దీనిపైన ఆటు రకుల్ కానీ కోన వెంకట్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.. దీనికి తాప్సీని ఈ ప్రాజెక్టులో అనుకున్నారు.

ఇక ఆటు రకుల్ కూడా సినిమాలు లేకపోవడంతో తన వ్యాపారాలు, పెట్టుబడులను చూసుకుంటూ ఆమె హైదరాబాద్‌లోనే ఉండిపోయింది.. ఇక కరోనా లాంటి విపత్కరమైన సమయంలో చాలా మందికి సహాయం చేసి అండగా నిలిచింది రకుల్..పవన్ కల్యాణ్-క్రిష్‌ కాంబినేషన్ లో రకుల్ నటించే అవకాశాలుబ్ ఉన్నట్టుగా సమాచారం. అంతేకాకుండా కమల్‌ హాసన్‌ 'ఇండియన్‌ 2'లో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది.

Krishna

Krishna

Next Story