Rakul Preet Singh: పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్

Rakul Preet Singh: "అప్పుడే పెళ్లి చేసుకుంటాను అంటున్న" రకుల్ ప్రీత్

admin1
Updated on: 9 Jan 2022 7:31 PM IST
Rakul Preet Singh Gave Clarity About Marriage | Telugu Movie News
X

పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్

Rakul Preet Singh: ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గత కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ హిందీ లో మాత్రం బాగానే సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా ఈమె బాలీవుడ్ నటుడు జాకీ భగ్నాని తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గత కొంత కాలంగా వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు, రకుల్ ప్రీత్ తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది రకుల్ ప్రీత్.

"ఇలాంటి అసత్య ప్రచారాలను నేను ఏమాత్రం పట్టించుకోను. నా పని నేను చేసుకు పోతున్నాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పటికే పది సినిమాల్లో నటించడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాను. కాబట్టి నా ధ్యాస మొత్తం ఇప్పుడు సినిమాల మీద మాత్రమే ఉంది. జాకీ తో నేను ప్రేమలో ఉన్న విషయాన్ని ఎలా బహిరంగంగా వెల్లడించానో, మా పెళ్ళి విషయాన్ని కూడా అంతే ఓపెన్ గా చెబుతాను. ముఖ్యంగా మీడియాతో చెప్పిన తరువాతే నేను పెళ్లి చేసుకుంటాను," అని చెప్పిన రకుల్ ప్రీత్ అప్పటిదాకా తన పెళ్లి గురించి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని కోరుకుంది.

admin1

admin1

Next Story