సరికొత్త కాన్సెప్ట్ తో నందమూరి హీరో...

సరికొత్త కాన్సెప్ట్ తో నందమూరి హీరో...
x
Highlights

ఎన్టీఆర్ బయోపిక్ లో తన తండ్రి హరీష్ కృష్ణ పాత్రలో కనిపించిన కళ్యాణ్ రామ్ ఈమధ్యనే '118' చిత్రంలో హీరోగా నటించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల...

ఎన్టీఆర్ బయోపిక్ లో తన తండ్రి హరీష్ కృష్ణ పాత్రలో కనిపించిన కళ్యాణ్ రామ్ ఈమధ్యనే '118' చిత్రంలో హీరోగా నటించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు కళ్యాణ్ రామ్. తాజాగా కొత్త దర్శకుడు వశిష్ట మల్లిది దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకున్నాడు కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి హీరో స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది పునర్జన్మ బాక్ డ్రాప్ తో సాగుతుంది అని తెలుస్తోంది.

'118' సినిమా లో షాలిని పాండే, నివేదాథామస్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో కూడా కళ్యాణ్ రామ్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్, కాథరిన్ తెరీసా హీరోయిన్లుగా నటిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కథానాయకుల తాలూకా అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అన్ని అనుకున్నట్లు సాగితే ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. పూర్వజన్మ కాన్సెప్ట్ తో తెలుగులో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. మరి ఈ కాన్సెప్ట్ కళ్యాణ్ రామ్ కు ఎంత వరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories