Rakul Preet Singh: అందుకే ప్రేమ విషయాన్ని ముందే చెప్పేసాను..

Rakul Preet Singh: చాలామంది సెలబ్రిటీలు ప్రేమలో పడినప్పటికీ తమ ప్రేమ విషయాన్ని మీడియా ముఖంగా ఒప్పుకోవడానికి ఇబ్బంది పడతారు.

Arun Chilukuri
Updated on: 24 May 2022 6:00 PM IST
Rakul Preet Singh talks about her relationship with Jackky Bhagnani
X

Rakul Preet Singh: అందుకే ప్రేమ విషయాన్ని ముందే చెప్పేసాను..

Rakul Preet Singh: చాలామంది సెలబ్రిటీలు ప్రేమలో పడినప్పటికీ తమ ప్రేమ విషయాన్ని మీడియా ముఖంగా ఒప్పుకోవడానికి ఇబ్బంది పడతారు. తాము కేవలం స్నేహితులు మాత్రమే అంటూ ఎప్పటికప్పుడు తమ ప్రేమను కప్పి పుచ్చుతూ ఉంటారు. కానీ ప్రముఖ టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ మాత్రం అలా కాదు. బాలీవుడ్ నిర్మాత మరియు నటుడు అయిన జాకీ భగ్నాని తో తాను పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు రకుల్ ప్రీత్ ఓపెన్ గా చెప్పేసింది. అయితే తన వ్యక్తిగత జీవితం గురించి మరియు ప్రేమ గురించి రకుల్ ప్రీత్ ఎలా ఓపెన్ గా చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయట.

"మేము మా ప్రేమ గురించి అధికారికంగా చెప్పకపోతే మేము కలిసి కనిపించిన ప్రతిసారి మా ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ పుకార్లు బయటకు వస్తాయి. మేము మా వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో నిలవాలని అనుకోవడం లేదు. కేవలం సినిమాల పరంగా మాత్రమే మీడియాలో ఉండాలని అనుకుంటున్నాము. అందుకే వ్యక్తిగత విషయాల గురించి తొందరగా క్లారిటీ ఇచ్చాము. ముందు మేమిద్దరం ఒకరికి ఒకరు క్లారిటీ ఇచ్చుకున్న తర్వాత సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాము" అని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉంది కాబట్టి రకుల్ ముంబై లోనే సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపించాయి కానీ ఆఫర్లు వస్తే సౌత్ లో కూడా తప్పకుండా చేస్తాను అని క్లారిటీ ఇచ్చింది ఈ భామ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story