Richard Anthony: "రిచర్డ్ అంథోని"గా వస్తున్న రక్షిత్ శెట్టి

Richard Anthony: "ఉలిధావారు కందాన్తే" కన్నడ చిత్రంతో అటు దర్శకుడిగా, హీరోగా సినిమా ప్రపంచానికి పరిచయమైన రక్షిత్ శెట్టి

Sandeep Reddy
Published on: 11 July 2021 3:37 PM IST
Richard Anthony: రిచర్డ్ అంథోనిగా వస్తున్న రక్షిత్ శెట్టి
X

రిచర్డ్ అంథోని పోస్టర్(ట్విట్టర్ ఫోటో)

Richard Anthony: "ఉలిధావారు కందాన్తే" కన్నడ చిత్రంతో అటు దర్శకుడిగా, హీరోగా సినిమా ప్రపంచానికి పరిచయమైన రక్షిత్ శెట్టి ఇటీవల తెలుగులో విడుదలైన "అతడే శ్రీమన్నారాయణ" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కన్నడ సినీ రంగంలో అటు దర్శకుడిగా, హీరోగా బిజీ బిజీగా ఉండే రక్షిత్ శెట్టి తాజాగా ఒక కథని కూడా సిద్ధం చేసుకొని తనే హీరోగా "రిచర్డ్ అంథోని ది లార్డ్ అఫ్ సీ" చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని ప్రకటించాడు. ఈ కథను రక్షిత్ శెట్టి గోవా వెళ్లి సిద్దం చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. మంచి విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాని కేజీఎఫ్ సినిమాని నిర్మించిన హంబల్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించనున్నట్లు ఇప్పటికే పూర్తి అయిన ఈ కథ కోసం నటీ నటుల ఎంపిక కూడా త్వరలో ప్రారంభం కానుందని సమాచారం.

గతంలో టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందనని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకున్న రక్షిత్ ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఇద్దరు పెళ్లి కాకుండానే విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక.. తాము పెళ్లి చేసుకోవద్దని అనుకున్న రక్షిత్ శెట్టి తనకు ఎప్పటికీ మంచి మిత్రుడుగా ఉంటాడని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేసింది. ఇప్పటికే కిరణ్ రాజ్ దర్శకత్వంలో షూటింగ్ పూర్తి చేసుకున్న "777 చార్లీ" చిత్రంతో ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రక్షిత్ శెట్టి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story