Bhaag Milkha Bhaag: ఆ సినిమాకి సోనమ్ కపూర్ రెమ్యునరేషన్ "11 రూపాయలు"

Sandeep Reddy
Published on: 12 Aug 2021 5:04 PM IST
Rakeysh Omprakash Mehra Says in His Autobiography About Sonam Kapoor Remuneration in Bhaag Milkha Bhaag Movie
X

సోనమ్ కపూర్ (ట్విట్టర్ ఫోటో)

Bhaag Milkha Bhaag: భారత్ తరపున అథ్లెటిక్స్ లో అటు కామన్ వెల్త్ గేమ్స్ లోనే కాకుండా ఆసియన్ గేమ్స్ లో స్వర్ణం సాధించిన పరుగుల వీరుడు మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన "భాగ్ మిల్కా భాగ్" చిత్రం బాలీవుడ్ లో 2013లో విడుదలై రికార్డు కలెక్షన్స్ తో చరిత్ర సృష్టించింది. రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిల్కా సింగ్ పాత్రలో ఫర్హాన్ అక్తర్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సోనమ్ కపూర్ రెమ్యునరేషన్ గురించి దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాష్ చేసిన తన ఆటోబయోగ్రఫీ "ది స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్" లో రాసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

మిల్కా సింగ్ వంటి లెజెండరీ వ్యక్తి జీవిత కథతో సినిమా తెరకెక్కుతుండటంతో "భాగ్ మిల్కా భాగ్" వంటి సినిమాలో నటించడానికి తన ఇష్టపూర్వకంగా కేవలం 11 రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుందని తెలిపాడు. మిల్కా సింగ్ దేశం అటు ఆర్మీలో సేవ చేయడంతో పాటు భారత్ కు అథ్లెటిక్స్ లో స్వర్ణాన్ని సంపాదించినా వ్యక్తి గౌరవార్ధం సోనమ్ కపూర్ రెమ్యునరేషన్ 11 రూపాయలు తీసుకొని తన గౌరవాన్ని చాటిందని తన పుస్తకంలో తెలిపాడు. ఇక త్వరలో శోమే మఖిజా దర్శకత్వంలో తెరకెక్కిన "బ్లైండ్" అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో సోనమ్ కపూర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story