Rakesh Master: రాకేష్ మాస్టర్ ఇంటిపై దాడి..కేసు నమోదు

Rakesh Master: శ్రీకృష్ణుడి పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ రాకేష్ మాస్టర్ ఇంటి పై దాడి జరిగింది.

Kranthi
Updated on: 4 May 2021 12:48 PM IST
Rakesh Master Complained to the Police That his was Attacked by Thugs
X

Rakesh Master: (File Image)

Rakesh Master: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. రాకేష్ మాస్టర్ గురించి పరిచయమే అక్కర్లేదు. తన ఫేస్ టు ఫేస్ మాటలతోనే వివాదాల్లోకి దిగుతున్న రాకేష్ మాస్టర్.. ఈ మధ్య కాస్త తగ్గి జబర్దస్త్ షోలు చేసుకుంటున్నాడు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీ కృష్ణుడి పై కొన్ని వ్యాఖ్యలు చేయగా.. ప్రస్తుతం దాని గురించి రాకేష్ మాస్టర్ పై కేసు నమోదయ్యింది.

9 నెలల క్రితం ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో యాదవుల ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడి పై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇక అవి వివాదానికి దారితీశాయి. శ్రీకృష్ణుడి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తమ మనోభావాలు దెబ్బతీశారంటూ యాదవ హక్కుల పోరాట సమితి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో శ్రీ కృష్ణ నగర్ లో నివసించే రాకేష్ మాస్టర్ ఇంటికి ఆదివారం సాయంత్రం 5:30 కు సాయి యాదవ్, ఇమ్రాన్ తదితరులు తన ఇంట్లోకి ప్రవేశించి అతడిని దూషించడంతో పాటు అతని ఇంటి కిటికీలను ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఆయనను చంపేస్తామంటూ బెదిరింపులు కూడా చేశారు. దీంతో ఆ రోజు రాత్రి రాకేష్ మాస్టర్ తనపై దాడి చేసిన వారిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. శ్రీ కృష్ణుడుపై దుర్భాషలాడిన రాకేష్ మాస్టర్, ఆ సమయంలో అతని వెంట ఉన్న తన భార్య, వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన వారిపై కూడా కేసు నమోదు చేయాలంటూ యాదవుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేకల రాములు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా రాకేష్ మాస్టర్ పై కూడా కేసు నమోదు చేశారు.

Kranthi

Kranthi

Next Story