Ramarao On Duty: ఇద్దరు భామలతో "రామారావు ఆన్ డ్యూటీ"

Sandeep Reddy
Updated on: 19 July 2021 7:27 PM IST
Rajisha Vijayan And Divyansha Kaushik Leading Actress in Raviteja Ramarao On Duty Movie
X

రామారావు ఆన్ డ్యూటీ (ట్విట్టర్ ఫోటో)

Ramarao On Duty: మాస్ మహారాజా రవితేజ హీరోగా "రామారావు ఆన్ డ్యూటీ" సినిమా ఇటీవలే ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ 68వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాజాగా ఇద్దరు హీరోయిన్స్ ని ఎంపిక చేసినట్లు ఆ సినిమా నిర్మాణ సంస్థ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. అటు తమిళం మరియు మలయాళం చిత్ర సీమలో టెలివిజన్ యాంకర్ గా, పలు చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించిన రజిషా విజయన్ ను ఎంపిక చేశారు. ఇక "మజిలీ" సినిమాలో కీలక పాత్రలో కనిపించిన దివ్యన్షా కౌశిక్ ని కూడా మరో హీరోయిన్ గా ఎంపిక చేశారు.

దివ్యన్షా కౌశిక్ ఇటీవలే ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో "ది వైఫ్" అనే హర్రర్ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించింది. తాజాగా రామారావు ఆన్ డ్యూటీ చిత్ర యూనిట్ లో ఇటీవల పలువురు స్టార్ హీరోయిన్స్ నటించనున్నరనే వార్తలు వచ్చిన తాజాగా ఈ కొత్త హీరోయిన్స్ ఎంపిక విషయం చిత్ర యూనిట్ ప్రకటించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలకు కళ్ళెం వేసింది. ఇక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ తో పాటు రవితేజ టీం వర్క్స్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ ఒక పవర్ ఫుల్ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఇటీవలే "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రవితేజ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న "ఖిలాడీ" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.



Sandeep Reddy

Sandeep Reddy

Next Story