Rajinikanth: మిగతా తమిళ హీరోల అడుగుజాడల్లో వెళ్తున్న రజినీకాంత్

Rajinikanth: టాలీవుడ్ డైరెక్టర్ తో చేతులు కలపనున్న తమిళ సూపర్ స్టార్

admin1
Updated on: 23 Dec 2021 10:00 PM IST
Rajinikanths Next Film with a Tollywood Director
X

 టాలీవుడ్ డైరెక్టర్ తో చేతులు కలపనున్న తమిళ సూపర్ స్టార్

Rajinikanth: ఈ మధ్య కాలంలో తమిళ హీరోలు తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తుండగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ మరొక సినిమాలో హీరోగా నటిస్తున్నారు. తాజాగా "తొలిప్రేమ" ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రేపు ఈ సినిమా టైటిల్ ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది సితార ఎంటర్టైన్మెంట్ వారు ఇప్పటికే ఈ సినిమాని ప్రకటించారు.

మరోవైపు ఈ మధ్యనే "వరుణ్ డాక్టర్" సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన శివకార్తికేయన్ కూడా "జాతిరత్నాలు" ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు వీరి బాటలో అడుగులు వేస్తున్న హీరో రజినీకాంత్. ఒక టాలీవుడ్ డైరెక్టర్ రజనీకాంత్ ని కలిసి ఒక కథ నరేట్ చేశారట. కథ బాగా నచ్చడంతో రజినీ వెంటనే ఓకే చెప్పేశాడట. "2 పాయింట్ ఓ" సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేక పోయిన రజనీకాంత్ "పెద్దన్న" సినిమాతో కూడా మంచి విజయాన్ని సాధించ లేకపోయారు. మరి ఈ సినిమాతో నైనా రజినీకాంత్ మళ్లీ ఫామ్ లోకి వస్తారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

admin1

admin1

Next Story