Rajinikanth: మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు.. రజిని స్ట్రాంగ్ కౌంటర్..

Rajinikanth: జైలర్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Arun Chilukuri
Published on: 9 Aug 2023 1:04 PM IST
Rajinikanths Jailer Audio Launch Speech Goes Viral in Social Media
X

Rajinikanth: మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు.. రజిని స్ట్రాంగ్ కౌంటర్..

Rajinikanth: జైలర్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తనను విమర్శించిన వారికి రజిని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్ని విమర్శలు చేసినా తాను మౌనంగానే సమాధానం ఇచ్చానని... ప్రతి ఒక్కరూ విమర్శలకు తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని రజనీ కామెంట్ చేశారు. ఈ లోకంలో మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు.. ఈ రెండు జరగని ఊరేలేదని రజిని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనం మాత్రం మన దారిలో వెళ్ళిపోతూ ఉండాలని ఆయన చెప్పారు. చివర్లో అర్థమైందా రాజా వన్ టూ టీసీ ఇవ్వడంతో రజనీకాంత్ టార్గెట్ చేసింది ఎవరని అంటూ సోషల్ మీడియాలో హార్ట్ డిబేట్ నడుస్తోంది.

రజనీకాంత్ ప్రసంగం చివరిలో ‘‘అర్ధమైందా రాజా’’ అని చెప్పడం ద్వారా ఇటీవల ఆయనపై విమర్శలు చేసిన వైసీపీ నాయకులకు కౌంటర్ ఇచ్చారా? అనే చర్చ కూడా సాగుతుంది. ఇక ‘జైలర్‌’ చిత్రంలో మోహన్‌లాల్‌, జాకీ ష్రాఫ్‌, శివరాజ్‌కుమార్‌, తమన్నా, రమ్యకృష్ణ, సునీల్‌, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. తమన్నా ఆడి పాడిన ‘కావాలయ్యా’పాట ఇప్పటికే యూట్యూబ్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story