విజయ్ దేవరకొండ తో నటించాలని ఉంది అంటున్న రజినీకాంత్ హీరోయిన్

Malavika Mohanan: ఆ టాలీవుడ్ స్టార్ తో నటించాలని ఉంది అంటున్న మాళవిక మోహన్

Jyothi
Published on: 19 May 2022 2:11 PM IST
Rajinikanths Heroine Says She Wants To Act With Vijay Devarakonda
X

విజయ్ దేవరకొండ తో నటించాలని ఉంది అంటున్న రజినీకాంత్ హీరోయిన్

Malavika Mohanan: మలయాళం మరియు తమిళ సినిమాలలో తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్న మాళవిక మోహనన్ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితురాలే. రజనీకాంత్ హీరోగా నటించిన "పెట్ట", విజయ్ హీరోగా నటించిన "మాస్టర్" సినిమాలలో కనిపించిన మాళవిక తన అందంతో మాత్రమే కాకుండా అభినయంతో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చుకుంది.

మాళవికా మోహనన్ మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. అయితే తాజాగా ఈమె #ఆస్క్ మాలవిక అంటూ సోషల్ మీడియాలో తన అభిమానులతో ఒక చిట్ చాట్ లో పాల్గొంది. అందులో భాగంగా మాళవిక మోహనన్ చెప్పిన కొన్ని ఆసక్తికరమైన సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమిళ్ లో స్టార్ హీరోలైన రజనీకాంత్ మరియు విజయ్ తో నటించారు.

ఇంకా ఎవరితోనైనా మీకు నటించాలని ఉందా అని ఒక అభిమాని అడగగా మాళవిక మోహనన్ "విజయ్ దేవరకొండ తో ఒక రొమాంటిక్ లేదా రామ్ కామ్ సినిమా చేయాలని ఉంది" అని జవాబిచ్చింది. ప్రస్తుతం లైగర్ మరియు ఖుషి సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ జనగణమన సినిమాలో కూడా చేయబోతున్నారు. మరి మాళవికా మోహనన్ కు విజయ్ తో నటించే అవకాశం ఎప్పుడు దొరుకుతుందో వేచి చూడాలి.

Jyothi

Jyothi

Next Story