Rajinikanth : నా చేతిలో రూ.2లు చూసి నవ్విన నా ఫ్రెండ్.. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న రజనీకాంత్!

Rajinikanth : నా చేతిలో రూ.2లు చూసి నవ్విన నా ఫ్రెండ్.. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న రజనీకాంత్!
x

Rajinikanth : నా చేతిలో రూ.2లు చూసి నవ్విన నా ఫ్రెండ్.. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న రజనీకాంత్!

Highlights

Rajinikanth: భారతదేశంతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అభిమానులు దేశ విదేశాల్లో ఉన్నారు. 70 ఏళ్లు దాటినా ఇంకా హీరోగా ఆయన సినిమాలను చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.

Rajinikanth: భారతదేశంతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అభిమానులు దేశ విదేశాల్లో ఉన్నారు. 70 ఏళ్లు దాటినా ఇంకా హీరోగా ఆయన సినిమాలను చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. రజనీకాంత్ సినిమాలకు మాత్రమే కాదు, ఆయన ఇచ్చే ప్రసంగాలకు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తాజాగా కూలీ ట్రైలర్ లాంచ్‌లో రజనీకాంత్ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. రజనీకాంత్ నటించిన కూలీ సినిమా ట్రైలర్ ఇటీవల చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ ఈవెంట్‌కు రజనీకాంత్, సత్యరాజ్, శ్రుతి హాసన్, ఉపేంద్ర, అక్కినేని నాగార్జున, లోకేష్ కనగరాజ్, అనిరుధ్ రవిచందర్ వంటి ఎంతోమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఎప్పటిలాగే ఈ కార్యక్రమంలో రజనీకాంత్ ప్రసంగం హైలైట్‌గా నిలిచింది. తన సహనటుల గురించి, సినిమా గురించి ఎన్నో విషయాలు మాట్లాడిన ఆయన, ప్రసంగం చివర్లో తన జీవితంలో జరిగిన ఒక ఎమోషనల్ ఘటనను గుర్తు చేసుకున్నారు. రజనీకాంత్ ఒకప్పుడు బెంగళూరులో బస్ కండక్టర్‌గా పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ అంతకుముందు ఆయన కూలీగా కూడా పనిచేశారట.

రజినీ కాంత్ మాట్లాడుతూ.. "ఒకసారి నేను కూలీగా పనిచేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి తన సామానును బండిలో పెట్టమని చెప్పాడు. నేను ఆ సామాను ఎత్తి వాహనంలో పెట్టగానే, అతను నా చేతిలో రెండు రూపాయలు పెట్టి నవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడే నాకు అర్థమైంది. అతను నా కాలేజీ రోజుల్లో స్నేహితుడని. కాలేజీలో నేను అతన్ని చాలా ఏడిపించాను. కానీ అప్పుడు జీవితం నన్ను ఏడిపించింది. అతన్ని పెద్దవాడిగా చేసింది. ఆ రోజు నేను చాలా ఏడ్చాను. నా జీవితంలో మొదటిసారి అంతలా బాధపడి ఏడ్చాను" అని రజనీకాంత్ ఎమోషనల్‌గా పంచుకున్నారు.

"ఎంత డబ్బు, ఆస్తులు ఉన్నా సరే, ఇంట్లో ప్రశాంతత, బయట కొంచెం గౌరవం లేకపోతే వ్యర్థం" అని రజనీకాంత్ ఒక విలువైన జీవిత పాఠాన్ని చెప్పారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories