రజనీకాంత్ కూలీ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది! లోకేష్ కనగరాజ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్

రజనీకాంత్ కూలీ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది! లోకేష్ కనగరాజ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్
x

Rajinikanth’s 'Coolie' Trailer Release Date Announced – Lokesh Kanagaraj Confirms Officially!

Highlights

రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న కూలీ మూవీ ట్రైలర్ ఎప్పుడో తెలుసా? డైరెక్టర్ లేటెస్ట్ అప్‌డేట్, రజనీ రియాక్షన్, మూవీ డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోండి.

కూలీ ట్రైలర్ రిలీజ్ డేట్ అధికారికంగా వచ్చేసింది!

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘కూలీ’ (Coolie). ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన చిక్కిటు, మోనికా పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్నాయి.

ఇక ట్రైలర్ ఎప్పుడొస్తుందా? అనే క్వశ్చన్ కు లేటెస్ట్ క్లారిటీ వచ్చింది.

ఆగస్టు 2న కూలీ ట్రైలర్.. డైరెక్టర్ లేటెస్ట్ అప్‌డేట్

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, “కూలీ ట్రైలర్‌ను ఆగస్టు 2న రిలీజ్ చేస్తున్నాం. ఒక్కటే ట్రైలర్ ఉంటుంది. ఈ విషయాన్ని ముందుగానే క్లారిటీగా చెబుతున్నా,” అంటూ తెలిపారు.

"రజనీ సార్ హగ్ చేశారు" - లోకేష్ కనగరాజ్

రజనీకాంత్ సినిమాను చూసిన తర్వాత ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యారని లోకేష్ చెప్పారు. “డబ్బింగ్ స్టూడియోలో పూర్తిగా సినిమాను చూసిన రజనీ సార్, నన్ను హగ్ చేశారు. ‘ఈ సినిమా దళపతిలా అనిపించింది’ అని చెప్పారు. ఇది హార్బర్ బ్యాక్‌డ్రాప్లో స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ మూవీ” అని వివరించారు.

భారీ తారాగణం, మాస్ బ్లాక్‌బస్టర్ ఫీల్

సన్ పిక్చర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న కూలీ మూవీలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతిహాసన్ వంటి స్టార్‌ క్యాస్ట్ కనిపించనున్నారు. భారీ సెట్స్‌, ప్రతి రోజు 1000 మంది టెక్నీషియన్స్ పని చేయడం సినిమాకు మరో స్పెషాలిటీ.

‘చిక్కిటు’, ‘మోనికా’ పాటలు యూట్యూబ్‌లో హిట్

ఇప్పటికే విడుదలైన పాటలుగా చిక్కిటు సాంగ్, మోనికా సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీల్ వీడియోల్లో మోనికా పాటకు ఊహించని క్రేజ్ ఏర్పడింది.

కూలీ మూవీ రిలీజ్ డేట్

ఆగస్టు 14, 2025న కూలీ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. రజనీకాంత్ ఫ్యాన్స్‌కి ఇది నిజంగా పండుగే!

Show Full Article
Print Article
Next Story
More Stories