ఫ్యాన్స్‌కు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ న్యూఇయర్ గిఫ్ట్.. పార్టీ ఏర్పాటుపై క్లారిటీ..

Arun Chilukuri
Published on: 3 Dec 2020 1:16 PM IST
ఫ్యాన్స్‌కు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ న్యూఇయర్ గిఫ్ట్.. పార్టీ ఏర్పాటుపై క్లారిటీ..
X

రాజకీయ పార్టీ ఏర్పాటుపై సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. తర్వలోనే పార్టీ పేరును ప్రకటించనున్నట్టు చెప్పారు. డిసెంబర్ 31న పార్టీపై పూర్తి ప్రకటన చేస్తానని రజనీకాంత్.. ట్వీట్ చేశారు. జనవరిలోగా కొత్త పార్టీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జనవరిలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని, అందుకు సంబంధించిన వివరాలను డిసెంబరు 31న ప్రకటిస్తానని వెల్లడించారు. అంతేగాక, 2021లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను కూడా ఎదుర్కోనున్నట్లు తెలిపారు.

త్వరలో జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ప్రజల ఆదరణతో గెలిచి రాష్ట్రంలో నిజాయితీ, న్యాయమైన, కులమతాలకు అతీతమైన అధ్యాత్మిక రాజకీయాలకు నాంది పలకడం నిశ్చయం. అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతాయి. మారుస్తాం.. అన్నింటినీ మారుస్తాం. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు అని రజనీకాంత్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story