నిన్నటితో పోలిస్తే మెరుగుపడిన రజనీకాంత్ ఆరోగ్యం

Arun Chilukuri
Published on: 26 Dec 2020 8:45 PM IST
నిన్నటితో పోలిస్తే మెరుగుపడిన రజనీకాంత్ ఆరోగ్యం
X

హైబీపీతో ఆసుపత్రిలో చేరిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలుస్తోంది. రక్తపోటును అదుపు తెచ్చేందుకు ట్రీట్‌మెంట్ కొనసాగిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.

నటుడు రజనీకాంత్‌కు ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని శుక్రవారంతో పోలిస్తే ఇవాళ మరింత బెటర్ అయందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం బీపీ కంట్రోల్‌లోనే ఉందని చెప్పారు. రజనీ హెల్త్ కండిషన్‌పై ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అపోలో డాక్టర్లు చెప్తున్నారు. రజనీలో కరోనా లక్షణాలు కనిపించలేదని బీపీ తప్ప ఇతర ఏ ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఆయనకు మరిన్ని టెస్టులు చేశామని చెప్పారు. రజనీని పరామర్శించేందుకు ఎవరూ ఆసుపత్రి రావొద్దని అంటున్నారు.

రజనీ ఆసుపత్రిలో చేరారన్న వార్త బయటకు రాగానే తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులంతా కలవరపాటుకు గురయ్యారు. ఆసుపత్రికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వారిని అడ్డుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయాలకు చెందిన పలువురు ప్రముఖులు గవర్నర్ తమిళిసై ఎప్పటికప్పుడు తలైవా ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తున్నారు.

రజనీకాంత్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాల్డ్ వైడ్‌గా ఉన్నారు ఆయనకు అభిమానులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ అభిమాన నటుడికి సంబంధించి ఫొటో, వీడియో ఏదో ఒకటి విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story