Rajinikanth: ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకొను అంటున్న రజనీకాంత్

Rajinikanth: సినిమాలకు గుడ్బై చెప్పే అవకాశమే లేదు అంటున్న సూపర్ స్టార్

admin1
Updated on: 19 Nov 2021 5:01 PM IST
Rajinikanth Says There is No Chance to Say Goodbye to Films
X

సినిమాలకు గుడ్బై చెప్పే అవకాశమే లేదు అంటున్న సూపర్ స్టార్ (ఫైల్ ఇమేజ్)

Rajinikanth: ప్రస్తుతం తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా చలామణి అవుతున్న రజినీకాంత్ ఇండస్ట్రీలోని ఐకానిక్ నటులలో ఒకరు. కండక్టర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టిన రజినీకాంత్ ఇప్పుడు కోట్లాది మంది అభిమానులను ఆదర్శంగా నిలిచారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన రజినీకాంత్ గత కొంత కాలంగా వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులో డబ్ అయిన రజినీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి.

దర్బార్, కాలా, పెట్టా, రాజన్న వంటి డిజాస్టర్ లని చవిచూసిన రజనీకాంత్ ప్యాన్ ఇండియన్ మార్కెట్ కూడా పడిపోయిందని చెప్పుకోవాలి. కానీ రజనీకాంత్ మాత్రం సినిమాల నుంచి రిటైర్ మెంట్ తీసుకోవాలి అనే ఆలోచన చేయడం లేదట. తనకి ఇప్పుడప్పుడే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని లేదని, మరికొన్నాళ్లు సినిమాలలో నటిస్తూనే ఉంటానని చెప్పినా రజినీకాంత్ సినిమాపై తనకున్న ప్రేమ ఇప్పటికీ అలాగే ఉందని అన్నారు.

admin1

admin1

Next Story