Rajinikanth: "ఇది నా జీవితంలో మర్చిపోలేని సినిమా" అంటున్న రజినీకాంత్

Rajinikanth: "కథ విన్నాక ఏడ్చేశాను" అంటున్న రజినీకాంత్
Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఈమధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "అన్నాతే". శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్ రజినీకాంత్ చెల్లెలి పాత్రలో కనిపించారు. తాజాగా "హూట్" అనే ఒక వాయిస్ బేస్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫాంలో సినిమా గురించి మాట్లాడుతూ కొన్ని ఆడియో క్లిప్స్ ని విడుదల చేశారు రజనీకాంత్. ఈ సందర్భంగా మాట్లాడుతూ "కార్తీక్ సుబ్బరాజ్ నన్ను "పెట్ట" సినిమాలో చాలా స్టైలిష్ గా చూపించారు. అప్పుడు డైరెక్టర్ శివ దర్శకత్వం వహించిన "విశ్వాసం" సినిమా కూడా విడుదలైంది. రెండు సూపర్ హిట్లు అయ్యాయి. అజిత్ హీరోగా నటించిన "విశ్వాసం" సినిమా నాకు చాలా బాగా నచ్చింది. సినిమాలో ఎంతగా ఇన్వాల్వ్ అయిపోయాను అంటే సినిమా చూస్తూ చప్పట్లు కూడా కొట్టాను" అని అన్నారు రజినీ.
"అప్పుడే శివా నా కోసం ఏమైనా స్క్రిప్ట్ ఉందా అని అడిగాను. అప్పుడు శివ నాతో సూపర్ హిట్ సినిమా కొట్టడం చాలా ఈజీ అని అన్నారు. ఇప్పటిదాకా నాతో మాట ఎవరూ అనలేదు. చాలా మంది డైరెక్టర్లు హిట్ సినిమా తీద్దామని అన్నారు కానీ ఇప్పటి దాకా ఎవరు మీతో హిట్ సినిమా తీయడం ఈజీ అని అనలేదు. కథ చెప్పటానికి ఆయన కేవలం రెండున్నర గంటల టైం, 3 బాటిల్ ల వాటర్ మాత్రమే అడిగారు. కానీ నేరేషన్ పూర్తయిన తర్వాత నేను శివ ను హగ్ చేసుకుని ఏడ్చేశాను. తను ఎలా నేరేట్ చేసాడో సినిమా అలానే ఉండాలని అన్నాను. ఆయన అంతకంటే ఇంకా బాగుంటుందని చెప్పారు. సినిమా షూటింగ్ చేసేటప్పుడు మాకు చాలా ఇబ్బందులు వచ్చాయి. కానీ అవన్నీ ఎదుర్కొని సినిమా చేసాము. "అన్నాతే" నా జీవితంలో మర్చిపోలేని సినిమా" అని అన్నారు రజనీకాంత్.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
రానా సినిమాని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు
20 May 2022 4:00 PM GMTషీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ
20 May 2022 3:30 PM GMTజీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు
20 May 2022 3:14 PM GMTదేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్
20 May 2022 3:00 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు...
20 May 2022 2:30 PM GMT