పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూపర్ స్టార్

Ruthvik
Published on: 11 March 2019 10:46 AM IST
పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూపర్ స్టార్
X

ఈ మధ్యనే 'పేట' సినిమాతో హిట్ అందుకున్న సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా కథ ముంబై నేపథ్యంలో సాగుతుందట. రజనీకాంత్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని, చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని మోసాలు చేసే వారి ఆట కట్టిస్తాడని తెలుస్తోంది.

ఇక 'బాషా' మరియు 'కాలా' సినిమాలో ముంబై నేపథ్యంలో నడిచే సినిమాలలో నటించారు రజనీకాంత్. మరోవైపు మురుగదాస్ కూడా విజయ్ 'కత్తి', సూర్య 'గజిని' సినిమాలను ముంబై నేపథ్యంలోనే తెరకెక్కించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. హీరోయిన్ పాత్ర కోసం నయనతార, కీర్తి సురేష్ ల పేర్లు వినిపించాయి కానీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. రజిని, మురుగదాస్ కాంబినేషన్లో రాబోతున్న మొదటి సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Ruthvik

Ruthvik

Next Story