Rajinikanth: రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌లైవా ఏమ‌న్నారంటే?!

Rajinikanth: దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇవాళ తమిళనాడు గవర్నర్ RN రవితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

Arun Chilukuri
Updated on: 8 Aug 2022 9:30 PM IST
Rajinikanth Meets Tamil Nadu Governor R N Ravi
X

Rajinikanth: రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌లైవా ఏమ‌న్నారంటే?!

Rajinikanth: దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇవాళ తమిళనాడు గవర్నర్ RN రవితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ ఊహాగానాలను హీరో రజనీకాంత్ కొట్టిపారేశారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని తలైవా స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన నో అని ఒక్కమాటలో చెప్పారు.

గవర్నర్ రవితో సుమారు అరగంటపాటు జరిగిన భేటీలో రాజకీయాల గురించి చర్చించానని చెప్పారు. అయితే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనతో మాత్రం ఆయనను కలవలేదని రజనీ స్పష్టం చేశారు. గవర్నర్‌తో ఏం చర్చించానన్నది చెప్పలేనన్నారు. గవర్నర్‌‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని రజనీకాంత్ చెప్పారు. గవర్నర్ ఉత్తరాదికి చెందినవారని, ఇప్పుడాయన ఇక్కడకు వచ్చినందున తమిళనాడు అన్నా, తమిళుల నిజాయితీ కష్టించి పనిచేసే స్వభావమన్నా చాలా ఇష్టమని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story