Rajinikanth, Kamal Haasan : 35 ఏళ్ల తర్వాత ఒకే స్క్రీన్ పై రజినీ, కమల్!

Rajinikanth, Kamal Haasan : తమిళ ప్రేక్షకులకి ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి.. త్వరలో రజినీకాంత్, కమల్ హసన్ కలిసి నటించబోతున్నారు.. దాదాపుగా

Krishna
Published on: 19 Aug 2020 11:00 AM IST
Rajinikanth, Kamal Haasan : 35 ఏళ్ల తర్వాత ఒకే స్క్రీన్ పై రజినీ, కమల్!
X
Rajinikanth, Kamal Haasan (File Photo)

Rajinikanth, Kamal Haasan : తమిళ ప్రేక్షకులకి ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి.. త్వరలో రజినీకాంత్, కమల్ హసన్ కలిసి నటించబోతున్నారు.. దాదాపుగా ఇద్దరి సినీ కెరీర్ ఒకేసారి మొదలైంది.. ఇద్దరు తమదైన నటనతో ఆకట్టుకొని చాలా మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు.. తమ కెరీర్ తొలినాళ్లలో వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ కలిసి నటించింది లేదనే చెప్పాలి.. మళ్ళీ వీరిద్దరూ కలిసి ఎప్పుడు నటిస్తారా అని ప్రేక్షకులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ టైం వచ్చింది.. కమల్‌ ఓన్ బ్యాన‌ర్ రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై రజినీకాంత్, కమల్ హసన్ కలిసి నటిస్తున్న సినిమా తెరకెక్కతుంది. కార్తీ 'ఖైదీ' సినిమాతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు లోకేశ్​ కనకరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దీనిపైన దర్శకుడు లోకేశ్​ కనకరాజ్ మాట్లాడుతూ.. రజనీ, కమల్ ఇద్దరూ నటించే చిత్రంపై చర్చలు జరుగుతున్నాయని, అంతా సవ్యంగా జరగితే అద్భుతం జరిగినట్టేనని ఆయన చెప్పారు. త్వరలోనే వివరాలని వెల్లడిస్తామని అన్నారు.

ఈ ప్రకటనతో రజినీ, కమల్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ అభిమానులు కూడా సంతోషంలో మునిగిపోయారు.. `ఈ సినిమాని తమిళ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు.. ఇప్పటివరకూ రజినీకాంత్, కమల్ హసన్ కలిసి మొత్తం పది సినిమాల్లో నటించారు.. దాదాపుగా 35 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసి నటిస్తున్నారు.

Krishna

Krishna

Next Story