Mani Ratnam: మణిరత్నం సినిమా కోసం ఒకే వేదికపై రజనీ- కమల్‌..

Mani Ratnam: సూపర్ సార్ రజనీకాంత్ మరియు లోక నాయకుడు కమల్ హాసన్ గురించి తెలియని వారు ఉండరు.

Arun Chilukuri
Updated on: 6 Sept 2022 10:00 AM IST
Rajinikanth, Kamal Haasan to Grace Mani Ratnams Ponniyin Selvan Trailer Launch
X

Mani Ratnam: మణిరత్నం సినిమా కోసం ఒకే వేదికపై రజనీ- కమల్‌..

Mani Ratnam: సూపర్ సార్ రజనీకాంత్ మరియు లోక నాయకుడు కమల్ హాసన్ గురించి తెలియని వారు ఉండరు. ప్రత్యేక పరిచయం అవసరం లేని వీరిద్దరూ సౌత్ సినీ ఇండస్ట్రీలో మర్చిపోలేని హిస్టరీని క్రియేట్ చేశారు. ఎలాంటి పాత్రలలోనైనా ఇట్టే ఒదిగిపోయి అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఇద్దరు స్టార్లు కలిసి కనిపించిన సందర్భాలు మాత్రం కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు త్వరలో విడుదల కాబోతున్న ఒక పాన్ ఇండియన్ సినిమా కోసం వీరిద్దరూ కలిసి కనిపించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ సినిమా మరేదో కాదు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న "పోన్నియిన్ సెల్వన్". లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో చాలావరకు సెలబ్రిటీలు కనిపించనున్నారు. తాజాగా సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కోసం ఏకంగా రజనీకాంత్ మరియు కమల్ హాసన్లను రంగంలోకి దింపింది చిత్ర బృందం. "ఇంతకంటే ఏది పెద్దది కాదు. ఉలగనాయగన్ కమల్ హాసన్ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ లు మా సినిమా మ్యూజిక్ మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లకు ముఖ్య అతిథులుగా విచ్చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాము" అని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.

ఈ నేపథ్యంలో కమల్ హాసన్ మరియు రజనీకాంత్ లను కలిసి చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమా తమిళ్, హిందీ, తెలుగు, మలయాళం, మరియు కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story