45 years of Rajinikanth: మీ వల్లే నేను ఇక్కడున్నాను: రజనీకాంత్

45 years of Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ మాట వినగానే మనకి గుర్తొచ్చేది ఒక్కటే స్టైల్.. ఆ వాకింగ్ స్టైల్ తోనే తన అభిమానులను గత 45

Krishna
Published on: 11 Aug 2020 12:08 PM IST
45 years of Rajinikanth: మీ వల్లే నేను ఇక్కడున్నాను: రజనీకాంత్
X
45 years of Rajinikanth:

45 years of Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ మాట వినగానే మనకి గుర్తొచ్చేది ఒక్కటే స్టైల్.. ఆ వాకింగ్ స్టైల్ తోనే తన అభిమానులను గత 45 సంవత్సరాలుగా అలరిస్తున్నారు రజినీకాంత్.. ఆగస్టు 15తో రజనీ సినీ రంగంలోకి వచ్చి 45 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు అయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అటు అభిమానులు సోషల్ మీడియాలో రజనీకాంత్‌ కామన్‌ డీపీ, ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి ట్విట్టర్ వేదికగా స్పందించారు రజినీకాంత్.. " ''నా సినిమా ప్రయాణం మొదలై 45 సంవత్సరాలు పూర్తవుతోంది. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన అభిమానులకు కృతజ్ఞతలు. మీ కోసం కాకపోతే నేను ఇక్కడ ఉండను'' అంటూ ట్వీట్ చేశారు రజినీ... ఇక తమిళనాడులో భారీ పోస్టర్లు అంటించి తమ నటుడి మీద అభిమానాన్ని చాటుకుంటున్నారు అభిమానులు..



ఇక రజినీకాంత్ 1975 లో కె.బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం 'అపూర్వ రాగంగళ్‌'తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు.. ఆ తర్వాత చాలా విభిన్నమైన పాత్రలను పోషించి మంచి పేరును సంపాదించుకున్నారు.. బాషా, అరుణాచలం, నరసింహ, చంద్రముఖి, రోబో చిత్రాలు రజినీకాంత్ స్థాయిని పెంచాయి.. ప్రస్తుతం అయన అన్నాత్తే అనే సినిమాలో నటిస్తున్నారు. కీర్తి సురేశ్, మీనా, ఖుష్బు ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు.

Krishna

Krishna

Next Story