Rajinikanth: విజయ్ డైరెక్టర్ తో చేతులు కలపనున్న సూపర్ స్టార్

Rajinikanth: బీస్ట్ డైరెక్టర్ తో రజినీకాంత్ సినిమా

admin1
Updated on: 27 Dec 2021 6:01 PM IST
Rajinikanth Film With Director Nelson Dilipkumar | Telugu Movie News
X

విజయ్ డైరెక్టర్ తో చేతులు కలపనున్న సూపర్ స్టార్

Rajinikanth: భారీ అంచనాల మధ్య విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్ "అన్నాతే" సినిమా తెలుగులో "రాజన్న" గా విడుదలైంది కానీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే రజనీ మాత్రం వరుసగా సినిమాలు సైన్ చేస్తూ దూసుకువెళ్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్ "అన్నాతే" సినిమాకి దర్శకత్వం వహించిన శివ తో మరొక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతకుముందు రజినీకాంత్ హీరోగా నటించిన "పెట్ట" సినిమాకి దర్శకత్వం వహించిన కార్తిక్ సుబ్బారాజ్ తో సూపర్ స్టార్ ఒక సినిమా చేయబోతున్నట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే బల్కీ దర్శకత్వంలో కూడా రజినీ ఒక సినిమా సైన్ చేశారు అంటూ టాక్ నడుస్తోంది. తాజాగా ఒక స్టార్ డైరెక్టర్ తో రజినీ సినిమా చేయబోతున్నరట. ఆ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. ఈ మధ్యనే తమిళంలో "డాక్టర్" అనే టైటిల్ తో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ అయిన సినిమాకి దర్శకత్వం వహించిన నెల్సన్ ఇప్పుడు రజినీకాంత్ తో సినిమా కి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకి సంబందించిన టాక్స్ జరుగుతున్నాయి. మరోవైపు నెల్సన్ విజయ్ హీరోగా నటిస్తున్న "బీస్ట్" సినిమాతో కూడా బిజీగా ఉన్నారు.

admin1

admin1

Next Story